06-04-2025 12:14:13 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అవార్డులనేది వ్యక్తుల నిరం తర శ్రమకు గుర్తింపు లాంటిదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం ఎఫ్‌ఆర్‌ఆర్సీ గ్లోబల్ ఎక్స్‌లెన్సీ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిధిగా హారీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన నేతలను మరవకూదదన్నా రు. తెలంగాణ కొత్తగా ఏర్పడినా నిలకడగా అభివృద్ధి సాధిస్తోందన్నా రు. కేసీఆర్ పాలనలో దేశంలోనే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాక తీయ, రైతుబంధు వంటి పధకాలు ఎంతో ప్రజాదరణ పొందాయన్నా రు. సాధారణంగా ఎన్నికలప్పుడు నాయకులు బిజీగా ఉంటారని, తా ను మాత్రం రిలాక్స్ మూడ్‌లో ఉం టానన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఒత్తిడికి గురి కాకుండా సంతోషంగా ఉంటానని తెలిపారు.