calender_icon.png 3 April, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత

24-03-2025 12:00:00 AM

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు

 కొండపాక,మార్చి 23 :మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదినం సందర్భంగా కుక్కునూరు పల్లి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు ఎంఆర్‌ఆర్ యూవసేన ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రథమ స్థానం పొందిన విద్యార్థులు  హరి ప్రియ రెడ్డి, ఐశ్వర్య, లోకేష్, అవంతి,ప్రవళిక,పల్లవి.ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులు క్రాంతి కుమార్, నిఖిల్,వర్ష,శరణ్య,సాయి మనస్వికా రాజేష్ చారి, రాజయ్య, బాలనర్సు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు.

రఘునందన్ రావు నివాసంలో విద్యార్థులను సర్టిఫికెట్,మెమొంటో, శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుకునూరుపల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, గజ్వేల్ బిజెపి పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్, ఎం ఆర్ ఆర్ యువసేన అధ్యక్షులు సదానంద గౌడ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.