రాజాపూర్, (విజయక్రాంతి): గురువులతోనే దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఉందని ఉపాధ్యాయ సంఘం నాయకులు సీఎంఓ బాలు యాదవ్, ఏఎంఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 20 మందిని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మోమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, హనుమంతు, పాపయ్య, శ్రీనివాస్, సుధాకర్, గోపికాంత్, వెంకట్రామిరెడ్డి, పావని, పీఆర్టీయూ, యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.