నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపో పరిధిలో విధులు నిర్వహిస్తూ ఇప్పటివరకు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపిన ఉత్తమ డ్రైవర్లకు అదిలాబాద్ ఆర్ఎం సులోమన్ శుక్రవారం సన్మానం చేశారు. స్థానిక బస్ డిపోలో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకొని డ్రైవర్లు శంకర్ నాయక్ అమర్ సింగ్ గుండయ్య దశరథ్ తదితర డ్రైవర్లను శాలువాతో సన్మానించి మెమొంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిఎం ప్రతిమారెడ్డి అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.