calender_icon.png 11 January, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు

04-12-2024 02:54:21 AM

* ఉత్తమ కార్గో సేవలకుగాను గుర్తింపు

రాజేంద్రనగర్, డిసెంబర్3: ఎయిర్ కార్గోకు సంబంధించి ఉత్తమ సేవలకు గాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డు లభించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళ వారం చెన్నైలో జరిగిన 5వ ‘సౌత్ ఈస్ట్ ఎయిర్ కార్గో కాన్‌క్లేవ్ అండ్ అవార్డ్స్ 2024’లో హైదరాబాద్ జీఎంఆర్ ఎయిర్‌కార్గోకు టైమ్ క్రిటికల్ లాజిస్టిక్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డు లభించింది. ఈ గుర్తింపు.. సమయ, సున్నితమైన షిప్‌మెంట్‌లను నిర్వహించడంతో జీహెచ్‌సీ అసమాన శ్రేష్టతను నొక్కి చెబుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఎయిర్ కార్గో పరిశ్రమలో ఒక ప్రధాన కార్యాక్రమం అయిన ఆగ్నేయ ఎయిర్‌కార్గో కాంక్లేవ్ అండ్ అవార్డ్స్..  ఎయిర్ ఫైట్ లీడర్లు, రెగ్యులేటర్లు మరియు విధాన నిర్ణేతలతో సహా ఈ రంగం అంతటా ఉన్న ఉత్తమ మేధావులను ఏకతాటిపైకి తెస్తుందని జీహెచ్‌ఐ ఏఏల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ తెలిపారు. కార్గో సేలవకు అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.