calender_icon.png 25 March, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ సుబ్రహ్మణ్యానికి అవార్డు

23-03-2025 12:06:48 AM

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాం తి): పాలియేటివ్ కేర్ రంగంలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని బంజా రాహిల్స్ రోటరీ క్లబ్ వారు ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యంకు రోటరీ ఇంటర్నేషనల్ అత్యున్నత ‘సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డు’ను ప్రదానం చేశారు. ఈ అవార్డు వ్యక్తిగత రోటేరియన్లకు అత్యున్నత గౌరవం గా భావిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారాన్ని 150 వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. రెయిన్‌డబో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు అనుబంధించబడిన అనస్థీషియాల జిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక పాలియేటివ్ కేర్ సెంటర్ అయిన స్పార్ష్ హాస్పిస్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ హాస్పిస్ ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సంరక్షణ ను అందిస్తుంది. 2011 లో ప్రారంభమైనప్పటి నుంచి 13,000 మందికి పైగా రోగులకు సేవలందించింది. 30,000 మందికి పైగా గృహ సందర్శనలు నిర్వహించింది. 

ప్రతిరోజూ దాదాపు 6000 మంది రోగులకు పాలియేటివ్ కేర్ను అందిస్తోంది. డాక్టర్ సుబ్రహ్మణ్యం నిస్వార్థ సేవ స్పార్ష్ హాస్పిస్ను లెక్కలేనన్ని కుటుంబాలకు ఆశాకిరణంగా మార్చాయి. సమాజానికి ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక ఫర్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు.