25-04-2025 08:43:33 PM
కాటారం (విజయక్రాంతి): మలేరియా వ్యాధి నిర్మూలనలో ఉత్తమంగా సేవలందించిన వైద్య ఆరోగ్య సిబ్బందికి అవార్డులను ప్రధానం చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ సమావేశం మందిరంలో అవార్డులను జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి(District Additional Collector Vijayalakshmi), జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ చేతులమీదుగా ప్రధానం చేశారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్ కాపర్తి రాజుకు, కాలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సుస్మితకు, తాడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో హెల్త్ సూపర్వైజర్ హేమ సింగ్ కు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారిని డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.