calender_icon.png 1 February, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి

31-01-2025 11:20:45 PM

డిఆర్‌డివో పీడీ మండల ప్రత్యేక అధికారి సురేందర్...

కామారెడ్డి (విజయక్రాంతి): లింగంపేట్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్‌ పంచాయతీ అధికారులతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు డిఆర్‌డిఓ పీడీ సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళిక బద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.

గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్రస్థాయిలో గ్రామాలు తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలన్నారు. అన్ని గ్రామాల్లో వెంటనే బోర్ల  మరమ్మత్తులు, ప్లషింగ్ చేయించాలని ఆదేశించారు. తాగునీటిని వృధాకాకుండా గ్రామాల్లో ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులు ప్రజలతో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పీవో సురేందర్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏఈలు రజనీకాంత్, విష్ణు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.