calender_icon.png 24 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చగొట్టే వ్యవహారాలకు దూరంగా ఉండాలి

25-10-2024 01:11:16 AM

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఎమ్మెల్యే

మాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కేసు విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): నాంపల్లి హుమాయున్‌నగర్‌లో ఈ నెల 7న ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్,  కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్ ఖాన్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ఇరువర్గాలను పిలిచి కార్యనిర్వా హక న్యాయస్థానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు మెజిస్ట్రేట్ ముందు హాజరై తమ వాదనలను వినిపించారు. వాదప్రతివాదలను విన్న సీపీ.. అలాంటి రెచ్చగొట్టే కార్యక్రమా లకు దూరంగా ఉండాలని సూచించారు. కేసు తదుపరి విచారణకు వాయిదా వేశారు. కాగా, నాంపల్లి నియో జకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్‌లోని ఫిరోజ్‌గాంధీ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఏర్పడిన గుంతలో పడటంతో ఓ వృద్ధుడికి గాయాల య్యాయి. తనకు ఎదురైన పరిస్థితిని ఆ వృద్ధు డు ఇటీవల ఫిరోజ్‌ఖాన్‌కు చెప్పుకున్నాడు. ఈ పనులను పరిశీలించడానికి ఫిరోజ్ ఖాన్ ఈ నెల 7న తన అనుచరులతో కలిసి ఫిరోజ్‌గాంధీ నగర్‌కు వచ్చారు. ఆ సమయంలో స్థానిక మహిళ ఒకరు సీసీ రోడ్డు నిర్మించడానికి ఎంఐఎం నాయకులు తమ వద్ద డబ్బులు అడుగుతున్నారని ఫిరోజ్‌ఖాన్‌తో చెప్పింది. దీంతో ఎంఐఎం పార్టీ వాళ్లు అంతే అన్నట్లుగా ఫిరోజ్‌ఖాన్ బదులిచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న ఎంఐఎం కార్యకర్త ఒకరు స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌కి ఫోన్ చేసి ఫిరోజ్‌ఖాన్ ఎంఐఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకొని ఫిరోజ్‌ఖాన్ రాకను వ్యతిరేకిస్తూ తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పోలీసుల సమక్షంలోనే ఒకరి పై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడు లు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఫిరోజ్‌ఖాన్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యం లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.