calender_icon.png 26 December, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వర్‌రెడ్డి చిలక జోస్యం మానుకో

04-11-2024 02:12:31 AM

  1. వచ్చే ఎన్నికల్లోనూ అధికారం మాదే
  2. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాల, నవంబర్ 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి పదవీ వియోగం ఉన్నదన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చిలక జోస్యం మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేమ్‌సాగర్‌రావు హితవు పలికా రు. ఆదివారం ఐబీ వద్ద ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరి జ్యోతిష్యం నేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో మళ్లీ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం అనేది అసంభవమ ని, బీఆర్‌ఎస్ దుకాణం మూత పడిందన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభే దాలు కుటుంబ సమస్యలాంటివన్నా రు. మంచిర్యాలలో రూ.300 కోట్లతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఈ నెలాఖరు లో ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.