రాహుల్‌గాంధీపై రాజ్‌నాథ్ ఫైర్
న్యూఢిల్లీ, జూలై 29: పార్లమెంటులో ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించారు. రాహుల్‌గాంధీ అబద్ధాలతో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ‘తప్పుడు ప్రకటనలతో ఆయన (రాహుల్) సభను తప్పుదోవ పట్టించకూడదు. విధుల్లో మరణించిన అగ్నివీర్స్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం చెల్లిస్తున్నది. బడ్జెట్‌లో అగ్నివీర్లకు నిధులు కేటాయించలేదనటం సరికాదు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి త్వరలోనే సమాధానమిస్తారు’ అని పేర్కొన్నారు.