హైదరాబాద్‌ను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలి
సీఎంకు వీహెచ్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి) : క్రీడలతో చెడు వ్యవసనాకు దూరంగా ఉండవచ్చని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ కోసం 10 నుంచి 12 ఎకరాల భూమి ని కేటాయించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌కుమార్ యాదవ్, కార్యద ర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, జ్ఞానసుందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడా రు. అంతకు ముందు అంబర్‌పేటలోని క్రీడా మైదాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి వీహెచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి వరకు జరిగిన మారథాన్‌లో యవత పెద్ద ఎత్తున యువత పాల్గొనడం అభినందనీయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను పట్టించుకోకపోవడంతో క్రీడామైదానాలన్ని దెబ్బతిన్నాయని విమర్శించారు.