నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రమాదాలు జరగకుండా పోలీసు రవాణా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) మంత్రి సీతక్కకు హెల్మెట్ ను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav), రవాణా శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.