ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ రక్షణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ సంస్థ...
సంగారెడ్డి అర్బన్: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏవిఎన్ఎల్ యూనిట్, డిసెంబర్ 17 నుండి 21 వరకు ఏవిఎన్ఎల్ చైర్మన్స్ కప్-2024 ముగింపు ఉత్సవాలలో శనివారం నిర్వహించింది. ఏవీఎన్ఎల్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 1వ డిఫెన్స్ పిఎస్యు, దీనిలో ఏవీఎన్ఎల్ అన్ని ఉద్యోగుల నుండి కార్పొరేటీకరణ తర్వాత క్రీడా ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. వేర్వేరుగా నిర్వహిస్తున్న 16 రకాల గేమ్‌లలో పోటీలలో పాల్గొన్నారు. ఏవీఎన్ఎల్ యూనిట్ల స్థానాలు, ఏవీఎన్ఎల్ చైర్మన్స్ కప్ 2024 ప్రారంభ ఉత్సవాలు 20 సెప్టెంబర్ 2024న వెహికల్ ఫ్యాక్టరీ జబల్‌పూర్‌లో జరిగింది. తదనంతరం, ఇతర ఏవి అనిల్ యూనిట్లు సంబంధిత ప్రదేశాలలో వివిధ రకాల గేమ్‌లను నిర్వహించాయి, ఇది మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ముగింపు ఈవెంట్‌లతో ముగిసింది.
21 డిసెంబర్ 2024న, ఏవీఎన్ఎల్ మెదక్ శరత్ స్టేడియంలో ఏవీఎన్ఎల్ ఛైర్మన్స్ కప్ 2024 ముగింపు వేడుక జరిగింది. బి. పట్ట్నాయక్, ఐ ఓ ఎస్ ఎస్, డైరెక్టర్, ఏబీఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఎస్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్, ఏబీఎన్ఎల్ మెదక్, రంజన ప్రసాద్, చైర్‌పర్సన్, ఏబీఎన్ఎల్ డబ్ల్యూ డబ్ల్యూ ఏ మెదక్, ఏవీఎన్ఎల్ మెదక్ & అనుబంధ సంస్థల ఇతర సీనియర్ అధికారులు, డబ్ల్యూ డబ్ల్యూ ఏ కమిటీ సభ్యులు, యూనియన్లు, అసోసియేషన్లు, వర్క్ కమిటీ, జెసిఎం సభ్యులు, అన్ని ఏవిఎన్ఎల్ యూనిట్ల క్రీడాకారులు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.