calender_icon.png 19 January, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేహ్‌లో గోధ్వజ్ స్థాపించిన అవిముక్తేశ్వరానంద సరస్వతి

21-10-2024 01:42:48 AM

లఢక్, అక్టోబర్ 20: జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రారంభించిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో స్వామీజీకి ఘనస్వాగతం లభిస్తోంది. యాత్రలో భాగంగా 29వ రోజు కేంద్రపాలిత ప్రాంతం లఢక్‌లో ఆదివారం పర్యటించారు. లేహ్‌లోని పోలో మైదానం సమీపంలోని రాధాకృష్ణ ఆలయంలో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్వామీజీ స్థాపించారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి శంకరాచార్య స్వామీజీ మాట్లాడారు. గోమాత ప్రాముఖ్యాన్ని భక్తులను వివరించారు. ఈ యాత్ర ఎందుకు చేపడుతున్నారో వివరించారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించేవరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ యాత్రలో మొత్తం 36 రాజధాని నగరాల్లో శంకరాచార్య స్వామీజీ పర్యటించనున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ యాత్రను చేపట్టారు.అయోధ్య నుంచి సెప్టెంబర్ 22న ప్రారంభమైన యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజు గోవును రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని స్వామీజీ ఇప్పటికే ప్రకటించారు.