calender_icon.png 18 October, 2024 | 3:59 PM

‘యావరేజ్ స్టూడెంట్ నాని’ రొమాన్స్

28-07-2024 12:05:00 AM

‘మెరిసే మెరిసే’ అనే మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటారు పవన్‌కుమార్ కొత్తూరి. ఇప్పుడు ఆయన డైరెక్టర్‌గా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ కుమార్ తన రెండో చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీనీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం ఆర్డనరీ అయినా, మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉండాలి’ అంటూ మోస్ట్  రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల; సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్.