calender_icon.png 16 January, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఎంసీ కాలేజీకి అటానమస్ హోదా

14-01-2025 12:23:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కాలేజీకి స్వయం ప్రతిపత్తి హోదా (అటానమస్ స్టేటస్) లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)- 2025--26 విద్యా సంవత్సరం నుంచి 10 ఏళ్ల కాలానికి ‘స్వయం ప్రతిపత్తి హోదా’ లేఖను అందజేసింది.

దీంతో 2025- -26 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ ఎక్సలెన్స్‌లో ఐఐఎంసీ కళాశాల కొత్త యుగంలోకి అడుగు పెట్టనున్నట్టు కళా శాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం పేర్కొన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ) 1973 నుంచి వాణిజ్యశాస్త్రం, మేనేజ్‌మెంట్ అండ్ సైన్స్ రంగాల్లో విద్యా వైభవానికి విశిష్టమైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.

1973లో 100 మంది విద్యార్థులతో ప్రారంభమైన కాలేజీలో ప్రస్తుతం 1,700 మంది విద్యార్థులు చదువుతున్నట్టు పేర్కొన్నారు. బీకామ్‌లో ఆనర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీబీఏ కోర్సులను అందిస్తుంది. 2023లో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందగా, ఐఎస్‌వో ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కాలేజీగా కూడా గుర్తింపు లభించినట్టు తెలిపారు.

కళాశాలలో పీహెచ్‌డీ, యూజీసీ నెట్, సెట్ అర్హత, అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంంలో కళాశాల సెక్రటరీ చల్లా ప్రసన్న కుమార్, ప్రిన్సిపల్ కూర రఘువీర్ కృషి అభినందనీయమన్నారు.