calender_icon.png 21 October, 2024 | 3:09 AM

మహిళపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి

16-10-2024 01:10:57 AM

శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మహిళపై ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘట న మంగళవారం వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఆర్కిటెక్ట్ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళ సోమవారం అర్ధరాత్రి ఆటోలో ఇంటికి వెళుతున్నది. ఆమె పై కన్నేసిన ఆటోడ్రైవర్ ఆటోను మజీద్ బండలోని నిర్మానుష ప్రాంతంలో ఆపాడు.

ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే ఆమెను కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీ సు లను సంప్రదించగా.. వారు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.