calender_icon.png 24 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి అండగా ఆటో కార్మిక సేవా సమితి

24-04-2025 07:18:15 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అంగడి బజార్ కు చెందిన జాడి రాంచందర్ కుటుంబానికి ఆటో కార్మిక సేవ సమితి అండగా నిలిచింది. గురువారం రాంచందర్ స్వగృహంలో సేవా సమితి చైర్మన్ నేరేళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో రాంచందర్ కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి చైర్మన్ నేరేళ్ల వెంకటేష్ మాట్లాడుతూ... రాంచందర్ కు గత నెల రోజుల కిందట హైబిపితో బ్రెయిన్ లో రక్తస్రావం అయి, పక్షవాతం వలన కాలు చేయి పడిపోయిందని, దీంతో ముగ్గురు సంతానం ఉన్న రాంచందర్ కుటుంబం జీవనం ఉపాధిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుపేద కుటుంబాలకు ఆటో కార్మిక సేవా సమితి వెన్నంటి ఉంటూ, వారికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సేవాసమితికి అండగా ఉంటూ, సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి వైస్ చైర్మన్లు సూరం శ్రీనివాస్, బుకాల సంతోష్ రెడ్డి, సతీష్, చొప్పించి లచ్చన్న, కోశాధికారి గోశిక ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు దుర్గం రాజమల్లు, దుర్గం రవి లు పాల్గొన్నారు.