14-02-2025 12:00:00 AM
కల్లూరు, ఫిబ్రవరి 13 : మూడు నెలల క్రితం భర్త గుండె పోటుతో మృతి చెందా డు. భర్త మరణం మరవక ముందే చేతికి అందించిన కొడుకు రోడ్డు ప్రమాదంలో కళ్ళ ముందు దుర్మరణం చెందడంతో ఆ పేద తల్లి రోదన స్థానికులను కలచివేసింది. ఈ ఘటన పెనుబల్లి మండలంలో గురు వారం చోటుచేసుకుంది. 13 మంది కూలీ లతో వెళుతున్న ఆటోని ట్రాక్టర్ ఢీ కొట్టడం తో ఒక యువకుడు మృతి చెందాడు.
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తుమ్మలపల్లి మురళి అస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందాడు. రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఆసుపత్రికి చేరుకొని మృతి చెందిన తుమ్మలపల్లి మురళి మృత దేహాన్ని సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుని కుటుం బాన్ని ఆదుకుంటామన్నారు.