15-02-2025 02:10:06 PM
అనంతగిరి: అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ సీసీ రోడ్డు పనులకు కోదాడ పట్టణానికి చెందిన ఏడుగురు కూలీలు బొజ్జగూడెం తండాకు టాటా ఏసీ ఆటోలో బయలుదేరి వస్తుండగా తండ గ్రామం లోపలకు వెళ్లే రహదారి వద్ద శనివారం ఆటో అదుపుతప్పి పంట పొలాల్లో పడిపోయింది. ఈ ఘటన లో ఏడుగురు కూలీలకు గాయాల అవడంతో అటాహుటిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.