calender_icon.png 24 April, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొట్టిన ఆటో

24-04-2025 12:41:36 AM

మహిళ మృతి..డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మెదక్, ఏప్రిల్ 23(విజయక్రాంతి) : రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా ఐరన్ లోడ్గల లారీ నిలపడంతో వెనుకనుండి ఆటో ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన మెదక్ జిల్లా హవేళీఘణపూర్ మండలం శాలిపేట శివారులో బుధవారం జరిగింది. బూర్గుపల్లి గ్రామానికి చెందిన పోతగల్ల రాములు ఆటోలో ప్రయాణీకులతో మెదక్ నుండి బూర్గుపల్లికి వెళ్తుంది.

శాలిపేట శివారులో జరుగుతున్న రోడ్డు పనుల కోసం ఐరన్ లోడ్తో ఉన్న లారీ రోడ్డు పక్కనే ఆపారు. అయితే ఆటో డ్రైవర్ రాములు గుర్తించక పోవడంతో అదుపుతప్పి వెనకనుండి ఢీకొట్టాడు. దీంతో ఐరన్ రాడ్లు డ్రైవర్ రాములతో పాటు ప్రయాణీకులకు గుచ్చుకున్నాయి. శాలిపేటకు చెందిన లక్ష్మీ(42)తో పాటు డ్రైవర్కు, చిన్నారులను ఆసుపత్రికి తరలించచారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ రాములును హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. చిన్న పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.

ఇలావుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలపడం వల్లనే ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చే వరకు గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవ్ప చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.