26-02-2025 08:41:26 PM
ప్రెసిడెంట్ కట్ట రాంకుమార్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్బంగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతరలో ఆటోలకు పార్కింగ్ చార్జీలు వాసులు చేయడంపై బుధవారం బెల్లంపల్లి ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ ఆలయ కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. బుగ్గ జాతరలో ప్రయాణికులను తీసుకువెళ్లడానికి ఆటోపార్కింగ్ స్థలం లేకుండా, వచ్చిన ప్రతి ఆటోకు ఆటో పార్కింగ్ ఛార్జ్ అక్రమంగా రూ.70 రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం నడిపిస్తున్న ఆటోల దగ్గర పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ఆటో పార్కింగ్ లేకపోవడంతో బుగ్గ జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. అధికారులు ఆటో పార్కింగ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆటో చార్జీలు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డైలీ నడుపుకుని జీవిస్తున్న ఆటోల దగ్గర నుంచి ఆటో పార్కింగ్ అక్రమంగా వసూలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఆటో పార్కింగ్ పేరుతో జాతర నిర్వాహకులు అక్రమ వసూళ్ళు నిలిపివేయాలని, లేనట్లయితే భవిష్యత్తులో జరిగే జాతరల సమయంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.