calender_icon.png 17 April, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం

26-03-2025 12:39:18 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): ఈ అసెంబ్లీ సమావేశాల అనంత రం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తోకలసి ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూ నియన్ గౌరవ అధ్యక్షులు వి.ఎస్.బోస్, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జెఏసి కన్వీనర్ బి. వెంకటేశం మంత్రి పొన్నం ప్రభాక ర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

గత నెలలో జరిగిన చేర్చల్లో ఏప్రిల్ నెలలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, ఇంధన చార్జీల పెంపునకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచ డం, రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, కొత్త ఆటో పర్మిట్ల మంజూ రు,

రాష్ట్ర ప్రభుత్వమే రవాణా అప్ ఏర్పా టు, స్కూల్ వ్యాన్లు, ఓలా, రాపిడో, ఉబెర్ ద్విచక్ర వాహనాలు, ఇతర జిల్లాల ఆటోలను నిషేధించడం వంటి ప్రధాన డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని బి. వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.