07-03-2025 12:00:00 AM
రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్
రాజేంద్రనగర్, మార్చి6(విజయక్రాంతి): ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ సూచించారు. గురువారం ఆయన అరంఘర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్స్ కి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. వాహనం నెంబర్ నాలుగు వైపులా ఉండాలని చెప్పారు.
విధిగా పత్రాలు ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రక్కన, బస్ స్టాప్ లలో ఆటోలు నిలుపరాదన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.