calender_icon.png 23 February, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు ఎస్ఐ ప్రసాద్‌ను సన్మానించిన ఆటో డ్రైవర్లు

22-02-2025 04:52:16 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ మేడా ప్రసాద్ ను ఆటో డ్రైవర్లు శనివారం ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఎస్ఐ ప్రసాద్ కు పూల బొకేలు అందించి శాలువాలతో సత్కరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆటోలకు సీరియల్ నెంబర్ స్టిక్కర్లను అతికించి కిరాయిల విషయంలో డ్రైవర్ల మధ్య గొడవలు రాకుండా, ప్రయాణికులకు అన్ని విధాల అనుకూలంగా ఉండేలా స్టిక్కర్ల విధానం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డ్రైవర్లు అన్నారు. ఈ నేపథ్యంలోనే మణుగూరు పోలీస్ శాఖ తరపున ఎస్ఐ మెడ ప్రసాద్ ను సత్కరించడం జరిగిందని ఆటో డ్రైవర్ల నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

వాహన తనిఖీలు: మణుగూరు పట్టణంలోని టిడిపి సెంటర్లో ఎస్ఐ శాంత వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులకు, వాహనానికి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. తనిఖీల్లో మణుగూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.