calender_icon.png 1 October, 2024 | 3:55 AM

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక 56 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్య

01-10-2024 01:32:08 AM

ఆటోడ్రైవర్ల హక్కుల సాధనకు అసెంబ్లీలో గళమెత్తుతా..

మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, సెప్టెంబరు 30 (విజయక్రాంతి ): కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా 56 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్య చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. ఆటోడ్రైవర్ల హక్కు ల సాధన కోసం తాను అసెంబ్లీలో గళమెత్తుతానన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ పంపి ణీ చేసి మాట్లాడారు.

మహాలక్ష్మి పథకంతో ఆటోడ్రైవర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సర్కార్ రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మృతిచెందిన వ్యక్తుల ఇంటికి వెళ్లి డ్రామా చేశారని, కానీ ఆయన సీఎం అయ్యాక  ఎవ రు చనిపోయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఆటో డ్రైవర్లు చనిపోతే ఎం దుకు సీఎం పట్టించకోవడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేల సాయం అందజేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడడం లేదని నిలదీశారు. రూ.లక్షల కోట్లతో మూసీని సుందరీకరిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.

గ్రామా ల్లో వీధి దీపాల నిర్వహణకు డబ్బుల్లేక అల్లాడుతుంటే.. సుందరీకరణ అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కట్టడాలు కూల్చడం తప్ప మరేమీ తెలియదన్నారు. సమావేశంలో ఆటో క్రెడిట్ కో సోసైటీ గౌరవ అధ్యక్షుడు పాల సాయిరాం పాల్గొన్నారు.