వివాహేతర సంబంధమే కారణం?
జనగామ, జనవరి 22 (విజయక్రాంతి): హనుమకొండలో బుధవారం పట్టపగలే ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్(40), ఏనుగు వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్లు. ఒకే మహిళతో ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉండటంతో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
సదరు మహిళ విషయంలో బుధ వారం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిం ది. హనుమకొండ అదాలత్ జంక్షన్ సమీపంలో నడిరోడ్డుపై ఇద్దరికి వాగ్వాదం జరి గింది. అప్పటికే తన వద్ద కత్తిని సిద్ధంగా ఉంచుకున్న వెంకటేశ్వర్లు అందరూ చూస్తుండగానే రాజ్‌కుమార్‌పై దాడికి తెగబడ్డాడు. కడుపులో నాలుగైదు పోట్లు బలంగా పొడవడంతో రాజ్‌కుమార్ మృతిచెందాడు.