హైదరాబాద్,(విజయక్రాంతి): సినిమాను తలపించేలా దంపతులు ఆటో డ్రైవర్ ను హత్య చేశారు. ఆటో డ్రైవర్ ను హత్య చేసిన ఘటనలో దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చందిన ఓ వ్యక్తి తన భార్య, కుతూరుతో కలిసి నగరంలోని జగద్గిరిగుట్టలో కారు డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిజాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమార్ ఏడో తరగతి చదువుతున్న తన కుతూరిని కిడ్నాప్ చేసి యూసఫ్ గుడ్ లో ఓ గదిలో బంధించిన లైంగిక దాడికి యత్నించాడు.
దీంతో ఆ బాలిక కుమార్ నుంచి తప్పించుకుని పారిపోతుంటే బాలనగర్ పోలీసులకు కనిపించింది. బాలికను పట్టుకొని విచారింగా, అనాథనని చెప్పడంతో ఆమెను ప్రత్యేక శిబిరానికి తరలించారు. మరో వైపు బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతిక్కిన దొరకలేదు. కొవిడ్ సమయంలో ఆన్ లైన్ క్లాస్ ల కోసం కొనుగోలు చేసిన బాలిక లాప్ టాప్ ను పరిశీలించడంతో స్నాప్ చాట్ లో ఒక ఫోన్ నంబర్ కనిపించింది. అది ఆటో డ్రైవర్ కుమార్ ది అని గుర్తించారు. కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో ఆటో డ్రైవర్ కుమర్ కు భార్యతో కలిసి స్నాప్ చాట్ ద్వారా హనీట్రాప్ చేశారు. హనీట్రాప్ చేసి కుమార్ ను బాలిక తల్లిదండ్రులు మియాపూర్ కు రప్పించారు.
ఆటో డ్రైవర్ మియాపూర్ రాగానే తల్లిదండ్రులు బాలిక తన నుంచి తప్పించుకోని పారిపోయిందని చెప్పడంతో తీవ్రంగా అతనిపై దాడి చేశారు. దీంతో ఆటో డ్రైవర్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆటో డ్రైవర్ ను కారులో ఎక్కించుకోని సూర్యాపేటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయికి కాళ్లు చేతులు కట్టేసి సాగర్ కాలువలో విసిరేశారు. దీతో ఆటో డ్రైవర్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటన 2023 మార్చిలో బోరబండ పోలీస్ స్టేషన్ లో కుమార్ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. తర్వాత కారు డ్రైవర్ కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నది. కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతున్నాడని అతని బంధువులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు కీలక మలుపు తిరిగింది.