calender_icon.png 31 January, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్మికులని ఢీకొన్న ఆటో.. డ్రైవర్ కు రెండు రోజులు జైలు శిక్ష

30-01-2025 03:17:18 PM

నిజామాబాద్, (విజయక్రాంతి): మద్యం మత్తులో మున్సిపల్ కార్మికులిని ఢీ కొట్టిన ఆటో డ్రైవర్ కు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మార్నింగ్ కోర్టు న్యాయమూర్తి(Magistrate Morning Court Judge) తీర్పు వెలువరించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఈనెల 29న బ్యాంక్ కాలనీ ఉప్పల మల్లయ్య పెట్రోల్ పంపు ఎదురుగా మున్సిపాలిటీ కార్మికురాలు రోడ్డు డివైడర్ మధ్యల పెరిగిన చెట్ల కలుపు, కట్టింగ్ పనులు చేస్తుండగా ఉదయం ఆటో డ్రైవర్ అబ్దుల్ మజీద్ తన ఆటో నెంబర్ TS16 UA 5554 మద్యం తాగిన మత్తులో అతివేగంగా ఆజాగ్రత్తగా నడుపుతూ నిమ్మ రాజు సాయమ్మ ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మున్సిపల్ కార్మికురాలి(municipal worker)కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి మద్యం తాగిన మైకంలో ఉన్నందున అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వేయగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అతనికి 2 రోజుల శిక్ష వేసి జైలు కు పంపినట్లు నాలుగవ టౌన్ పోలీసులు తెలిపారు.