ఇల్లెందు, (విజయక్రాంతి): అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన రెడ్డబోయిన సుమంత్ (36) రూ.6 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న సుమంత్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమంత్ మృతితో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.