calender_icon.png 24 February, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో-కారు ఢీ

23-02-2025 10:52:18 PM

నలుగురికి తీవ్ర గాయాలు..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద శనివారం అర్ధ రాత్రి ఆటో, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన బీరవల్లి వీరయ్య, బీరవల్లి వెంకటి, బీరవల్లి మోహన్రావులు దశదిన కర్మ కార్యక్రమానికి మటన్ తీసుకొచ్చేందుకు చెన్నూరుకి చెందిన ఆటోలో కొత్తగూడెం బయలుదేరారు. ఆటో టేకులపల్లి గ్రామం వద్దకు రాగానే జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్ కి వెళుతున్న కారు, ఆటోను ఢీకొనడంతో ఆటోడ్రైవర్ తో పాటు ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.