calender_icon.png 30 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి

27-03-2025 05:06:59 PM

రేపు సిద్దిపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్తార్ విందు..

సిద్ధిపేట (విజయక్రాంతి): సిద్ధిపేట పట్టణంలోని గద్ద బొమ్మ వద్ద ఉన్న మసీదు ఈద్గా వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల మార్చి 28 రోజున ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో బుధవారం పట్టణంలోని ఈద్గా వద్ద ఇఫ్తార్ విందు కోసం చేస్తున్న ఏర్పాట్లను సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఇఫ్తార్ విందుకు సిద్దిపేట పట్టణంలోని ముస్లింలందరూ తరలిరావాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింల అభివృద్ధి జరుగుతుందనీ, ఇప్తార్ విందుకు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరు అవుతారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఆ రోజున మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రియాజ్, పూజలా గోపి కృష్ణ, ముద్ధమ్ లక్మి, మజర్, మాలిక్, చందా పాష్, షాబుద్దిన్, గయాజుద్దీన్, వహాబ్, రషద్, అర్షద్, అజ్మత్, చోటా అజ్మత్, మున్న, ఇమ్రాన్ అలీ, ఖాజా పాషా, కవిత, సన, జనార్దన్, సాంబమూర్తి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.