calender_icon.png 24 November, 2024 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి అధికారులు సహకరించాలి

24-11-2024 12:19:20 AM

దిశ కమిటీ సమావేశంలో ఎంపీ సురేశ్‌షెట్కార్

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): అభివృద్ధిలో కామారెడ్డి జిల్లాను నంబర్ వన్‌గా చేద్దామని, అందుకు అధికారులు సహకరించాలని జహీరాబాద్ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ సురేశ్‌షెట్కార్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆయ న అధ్యక్షతన నిర్వహించిన దిశ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకువస్తానని చెప్పారు.

జిల్లాలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద 1,168 ఇళ్ల నిర్మాణాలకు గాను 1,167 పూర్తయ్యాయని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్, జననీ శిశు సురక్ష కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 23 శాఖ లు చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా, జంగం గంగాధర్, పద్మ శ్రీకాంత్, దిశ కమిటీ సభ్యులు నర్షియ నాయక్, జాదవ్, దేశ్‌ముఖ్ రాజు, నరేష్, కవిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ పాల్గొన్నారు.