calender_icon.png 1 April, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి కబ్జాపై స్పందించని అధికారులు

29-03-2025 09:15:17 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ శివారులో చిదుగు హేమలతకు సర్వే నంబర్ 85/B/2 రెండు ఎకరాలు, 85/B1/2 లో 28 గుంటల భూమి, బుర్ర జ్యోతికి సర్వే నంబర్ 85/B1/1 ఎకరం భూమి ఉందని, తమ ఫ్యామిలీ మెంబర్స్ కు మొత్తం కలిపి మూడు ఎకరాల 28 గుంటల భూమి ఉందని చిదుగు రమేష్ గౌడ్ తెలిపారు. తమ భూమి పక్కన ఉన్న సర్వేనెంబర్ 85లో నిర్మల సొసైటీ ఆఫ్ ది ప్రాన్స్ సిస్టర్ జీవదన్  కాన్వెంట్ వారు తమ భూమిలో 1ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరి గోడ నిర్మిస్తున్నారు.

అట్టి విషయంపైన ఆర్డీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కార్యాలయంలో టీపీఓకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. టీపీఓ పట్టించుకోవడంలేదని సర్వే నెంబర్ బట్టి సర్వే చేయించుకోవడం జరిగిందని, ఇంతవరకు సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. అధికారులు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని వాపోయ్యారు. అయినా కూడా తమ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణ పనులను నిలిపివేకపోవడంతో కోర్టు నుండి స్టే ఆర్డర్ కాఫీ తీసుకువచ్చమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు, తమ కుటుంబానికి న్యాయం చేయగలరని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.