అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా సూపర్ బెర్తు లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గ్రూప్ బుధవారం అంటి గ్వా వేదికగా నమీబియాతో తలపడేందుకు ఆసీస్ సమాయత్తమవు తోంది. ఇప్పటికే లీగ్ దశలో రెండు విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సూపర్ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో బలమైన ఆస్ట్రేలియాను నమీబియా ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తిక రం. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఆ మ్యాచ్‌లో 200 పై చిలుకు స్కోరు నమోదు చేసిన ఆసీస్.. నమీబియాతో పోరులోనూ భారీ స్కోరుపై కన్నేసింది.
బ్యాటింగ్‌లో వార్నర్, ట్రావి స్ హెడ్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, గ్రీన్ రాణిస్తుండడం సానుకూలాంశం. స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, నాథ న్ ఎల్లిస్‌లతో పేస్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తుండగా.. ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. మరో వైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో నమీబియా మూడో స్థానం లో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో శ్రీలంక, నేపాల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్ రేసులో నిలవాలంటే లంకకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లంక.. నేపాల్‌తో మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదముంది.