అంటిగ్వా: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా సూపర్ వేట ప్రారంభించనుంది. నేడు అంటిగ్వా వేదికగా గ్రూప్ బంగ్లాదేశ్‌తో ఆస్ట్రేలియా అమీతుమీకి సిద్ధమైంది. లీగ్ దశలో అపజయం ఎరుగని ఆస్ట్రేలియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు చచ్చీచెడీ సూపర్ అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో బలమైన ఆసీస్‌ను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్‌ను బంగ్లా ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్‌వెల్‌తో ఆసీస్ బ్యాటింగ్ బలంగా ఉంది.
బౌలింగ్‌లో స్టార్క్ పెద్దగా మెరవనప్పటికీ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్‌లు రాణిస్తుండడం సానుకూలాంశం. ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు పార్ట్‌టైమ్ బౌలర్లు స్టాయినిస్, హెడ్‌లు కూడా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో సీనియర్లు షకీబ్ అల్ హసన్, మహ్ముదుల్లాలు కీలకం కానున్నారు. వీరిద్దరు మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేరు. తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, రిషద్, షకీబ్‌లతో బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ఇరుజట్లు ముఖాముఖి 10 సార్లు తలపడగా.. ఆసీస్ 6 సార్లు, బంగ్లాదేశ్ 4 సార్లు విజయాలు సాధించాయి.