calender_icon.png 24 December, 2024 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియా... ఆ ఇల్లు

26-08-2024 12:30:00 AM

చెంపలమీద పూస్తున్న ముద్దబంతి పువ్వులతో ప్రేమలకు, మమకారాలకు కొత్త చిరునామాగా నిలిచిన ఆ ఇల్లు.. ఏమరకుండా సాగే జీవన విషాదాలకు చిరునవ్వుల థెరఫీతో బతుకును కొత్తగా  ప్రేమించడం నేర్పే ఆ ఇల్లు.. తోటలాంటి ఆ ఇంటిలో ముద్ద మాటల చిట్టి చిలక.. చిలకకు తోడుగా అక్కడ ఒక నవ్వుల జోదు కేరింతలతో.. ఆ ఇంటికి ఎన్నో రాజహంసలు అతిథులుగా వస్తాయి వయసు తిరిగిన తీయ మామిడి చెట్లు మాటల రసాలతో ప్రసన్నంగా వచ్చి పోతాయి కవిత్వమంత సౌందర్యం కలిగిన చిన్నమ్మాయి సూర్యుడిని- చందమామను మోస్తున్న భూమాత అవుతుంది వాటిని తనలో దాచుకున్న ఆకాశం లాంటి అతను జీవితాన్ని వర్షీకరిస్తాడు తెలుగు వెన్నెల గుండెల్లో దాచుకున్న తాత, అమ్మమ్మ నానమ్మ  పొగ వలయాలు ఛేదించుకుంటూ గాలి రెక్కలు కట్టుకొని ఆకాశం నుండి ఎగిరి వస్తారు అనివార్యంగా కొనసాగే నిత్య జ్వలనం కాసేపు శాంతిబావుట ఎగరేస్తుంది ఉషోదయాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే ఏదో దురాశ కలం కడుపులో అక్షరాలకు పురుడు పోస్తుంది.