04-03-2025 05:21:20 PM
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) తోలి సెమీస్ లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో 205 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్(07) ఔట్ అయ్యాడు. సిక్స్ కొట్టిన తర్వాత బంతికే మ్యాక్స్ వెల్ వికెట్ కోల్పోయాడు. అనంతరం క్రీజులోకి బెన్ డ్వారీషూస్ వచ్చాడు. అంతకు ముందు 198 పరుగుల వద్ద స్మిత్(73) వద్ద ఔట్ అయ్యాడు. షమీ వేసిన ఫుల్ టాస్ బంతిని ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టీవ్ స్మిత్ బౌల్డ్ అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్ లో వికెట్లు పడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
స్మిత్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వరుణ్ వేసిన 26వ ఓవర్ లో మూడో బంతికి ఫోర్ కొట్టిన స్మిత్ తర్వాత రెండు పరుగులు చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆస్ట్రేలియా 144 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన 27వ ఓవర్ లో చివరి బంతికి ఇంగ్లిస్ 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతను నేరుగా కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. వెంట వెంటనే వికెట్లు పడుతున్న ఆసీస్ బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. కుల్ దీప్ వేసిన 28వ ఓవర్ లో రెండు సింగిల్స్ రాగా, జడేజా వేసిన 29 ఓవర్ ఐదో బంతికి అలెక్స్ కేరీ ఫోర్ కొట్టాడు. దీంతో ఆసీస్ స్కోర్ 150 పరుగులు దాటింది. అయిదో వికెట్లు స్మిత్, అలెక్స్ జోడీ అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం ఆసీస్ 41 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగుల చేసింది. జెన్ డ్యారీషూస్(3), అలెక్స్ కేరీ(46) నిలకడగా ఆడుతున్నారు.