* భారత్‌తో చివరి రెండు టెస్టులకు
మెల్‌బోర్న్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలి యా జట్టు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనిపై వేటు పడగా అతడి స్థానంలో టీనేజ్ సంచలనం సామ్ కొనస్టాస్‌కు చోటు దక్కింది. పేసర్లు రిచర్డ్‌సన్‌తో పాటు సీన్ అబాట్ చోటు దక్కించుకున్నారు.బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున సామ్ కొన్‌స్టార్ 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. భారత్ జరిగిన అనధికారిక టెస్టులోనే శతకంతో మెరిశాడు. కాగా టీమిండియా, ఆస్ట్రేలి యా 1 సమంగా ఉన్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న (బాక్సింగ్ డే) మొదలుకానుంది.