పాట్ కమిన్స్‌కు విశ్రాంతి
స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలుపుతో వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న ఆస్ట్రేలియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంక పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులతో పాటు ఏకైక వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా లంకతో టెస్టు సిరీస్‌కు గురువారం జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన బృందానికి స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్‌కు అతడికి విశ్రాంతినిచ్చారు. కాగా జట్టులోకి నాథన్ మెక్‌స్వీనీకి పిలుపొచ్చింది. నాథన్ లియోన్‌తో పాటు టాడ్ ముర్ఫీ, మాథ్యూ కున్హేమన్‌లు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకున్నారు. 21 ఏళ్ల కూపర్ కొన్నోలి తొలిసారి ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్ జనవరి 29న, రెండో టెస్టు ఫిబ్రవరి 6న జరగనున్నాయి. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఆసీస్, లంక ఏకైక వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. టెస్టులతో పాటు వన్డే మ్యాచ్‌కు గాలే వేదిక కానుంది.