10 కోట్లు ప్రకటించిన ఫార్మా కంపెనీ
తెలంగాణ, ఏపీకి 5 కోట్ల చొప్పున సాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించింది. కంపెనీ ఉఫాధ్యక్షుడు, ఎండీ కె. నిత్యానంద రెడ్డి, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్డర్ పి.శరత చంద్రారెడ్డి రూ.5 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలకు అందజేశారు. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు, ఏపీలో విపత్తు నిర్వహణ శాఖకు విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి వరదలు రావడం దురదృష్టకరమని, ఈ విపత్తు అనేకమంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిందని నిత్యానంద రెడ్డి అన్నారు.