యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
అయోధ్య, డిసెంబర్ 20: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం కోల్‌కతాలో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నట్లు తన కు తెలిసిందని యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన సహనం, మైనార్టీలపై దాడుల వంటి అంశాలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శుక్రవారం అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ..
హిందూయిజానికి, హిందూ ఆరాధనా స్థలాలకు ఔరంగజేబు హాని చేయకుండా ఉంటే ఆయన వారసులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ప్రపంచ నాగరికతను పరిరక్షించాలంటే సనాతన ధర్మం, విలువలను కాపాడాలని యోగి హితవు పలికారు. పురాతనకాలం ఋషులు వ సుధైక కుటుంబానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. సనాతన ధర్మం అ న్ని మతాలను సమానంగా చూస్తుందని.. అలాంటి గౌరవం పలు ప్రపం చ దేశాల్లోని హిందువులకు దక్కకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.