calender_icon.png 30 October, 2024 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటగలిసిన మానవత్వం

10-08-2024 03:26:34 PM

కొడుకు మరణాంతరం కోడల్ని గెంటేసిన అత్త,మామ

సంవత్సరికం కార్యక్రమాన్ని ఇంటి బయట నిర్వహించిన కోడలు

హుజరాబాద్, విజయక్రాంతి: కొడుకు మరణాంతరం కోడల్ని గెంటేసి సంవత్సరం పాటు నరకాయతన చూపించి, కనీసం భర్త సంవత్సరికం చేసుకునేందుకు వీలు లేకుండా ఇంటికి తాళం వేసిన సంఘటన హుజురాబాద్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. భర్త సంవత్సరికాన్ని తాళం వేసిన ఇంటి ముందే నిర్వహించి తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆవేదన చూస్తే మానవత్వం మంట కలిసింది అనే చెప్పవచ్చు. వివరాల్లోకెళ్తే  వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రావుల మంజుల సురేందర్ కూతురు రవళిని హుజురాబాద్ కు చెందిన వీరగోని మొగిలి లచ్చమల కుమారుడు శ్రావణ్ కు ఇచ్చి వివాహం చేశారు.

రవళికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా శ్రావణ్ కు క్యాన్సర్ తో బాధపడుతూ ఆగస్టు 23 2023న మరణించాడు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రవళి అత్తమామ రూపంలో మరో నరకం చవిచూసింది. శ్రవణ్ మరణాంతరం రవళిని అత్త మామ మొగిలి, లచ్చమ్మలు తన కొడుకే లేనప్పుడు నీతో మాకేంటి అంటూ బయటకి గెంటేశారు. దీంతోపాటు సంవత్సరం పాటు ఇల్లు వదిలేయాల్సిందిగా చెప్పడంతో రవళి కూడా చేసేదేం లేక వేరే చోట ముగ్గురు పిల్లలతో కిరాయి ఇంట్లో జీవనం కొనసాగించింది. పలుమార్లు అత్తమామతో తనను, పిల్లల్ని చేరదీయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ససేమీరా అనడంతో సంవత్సరం పాటు దొరికిన పని చేసుకుంటూ పిల్లలను సాకింది.

కనీసం సంవత్సరికం రోజైన తనను చేరదీస్తారని ఎంతో ఆశతో ఉన్న రవళికి సంవత్సరికం రోజు కూడా చేదు అనుభవమే ఎదురయింది. భర్త సంవత్సరికం రోజు కూడా రవళిని రానివ్వకుండా ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.  తన భర్త సంవత్సరికం చేసుకునేందుకు కూడా వీలు లేకుండా చేశారని, తాను తన పిల్లలు ఉండేందుకు కూడా ఆశ్రయం లేదని కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా తనకు న్యాయం జరిపించాలంటూ తన గోడు మీడియా ముందు వెళ్లే బోసింది. చిన్నపిల్లలతో రవళి సంవత్సరికం నిర్వహించడం చూసిన చుట్టుపక్కల జనాలు సైతం బాధప్త హృదయముతో ఆమెకు న్యాయం జరగాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.