calender_icon.png 4 February, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బుగ్గ దేవాలయంలో దుకాణాల వేలం

04-02-2025 06:38:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు మహాశివరాత్రి జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ప్రసాదాలు, కొబ్బరికాయలు అమ్ముకోవడం, వాహనాల పార్కింగ్, తై బజార్ నిర్వహణ కోసం ఈ వేలం పాటలో పాల్గొనే వారు ముందస్తుగా రూ.20 వేలు డిపాజిట్ చెల్లించాలని వారు కోరారు.