16-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వాడ శ్రీ కేశవనాథస్వామి ఆలయానికి చెంది న భూములను ఒక సంవత్సర కాలం (01 31 వరకు సాగు చేసుకొనేందుకు ఈనెల 21న ఆల యం ఆవరణలో కౌలుకు బహిరంగ వేలం పాటను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి వేణుగోపాల్ గుప్తా మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో మొత్తం 89ఎకరాల 33 గంటల వ్యవసాయ భూమిని వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ వేలం పాటలో పాల్గొనే రైతులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలని, ధరావత్తు సొమ్ము రూ. 50వేల నగదును వేలం పాటకు ముందుగా నే చెల్లించాల్సి ఉంటందని తెలిపారు.
వేలం పాట ముగిసిన వెంటనే మొత్తం సొమ్మును దేవాలయానికి చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. రూ.100 నాన్ జుడీషియల్ స్టాంపు పేపర్‌పై వేలం పాట షరతులకు లోబడి అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపారు. షరతులను వేలం పాట సమయంలో చదివి వినిపించబడునని పేర్కొన్నారు. వివరాలకు 9618307962, 9908867600, 9885489088 నంబర్లను సంప్రదించాలన్నారు.