calender_icon.png 3 March, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ 07 పీ 9999 @ 9.37 లక్షలు

01-03-2025 11:20:00 PM

వేలంలో దక్కించుకున్న ముప్పా ప్రాజెక్ట్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్...

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): టీజీ 07 పీ 9999 అనే నంబర్ వేలంలో 9.37 లక్షలు పలికింది. మణికొండలోని రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో శనివారం ఫ్యాన్సీ నంబర్ల వేలంపాట నిర్వహించారు. వేలంలో పలు ఫ్యాన్సీ నంబర్లు భారీగా ధర పలికినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ముప్పా ప్రాజెక్ట్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీజీ 07 పీ 9999 నంబర్‌ను 9.37 లక్షలకు దక్కించుకున్నారు. అదేవిధంగా టీజీ 07 ఆర్ 0009 అనే నంబర్‌ను కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారు రూ.7లక్షల 50 వేలకు దక్కించుకున్నారు. శనివారం ఒక్కరోజే రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా 37 లక్షల ఆదాయం సమకూరినట్లు రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.