జయశంకర్ భూపాలపల్లి, జూలై 12(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 60 సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడం దారుణమని, బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలో ఆయన మాట్లాడారు. బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.