calender_icon.png 3 April, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి, సరుగుడు తోటలకు వేలం

02-04-2025 08:07:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని కన్నాల ఉద్యాన నర్సరీ ప్రాంతంలో గల మామిడి, సరుగుడు తోటల వేలాన్ని బుధవారం అధికారుల సమక్షంలో పూర్తి చేసినట్లు మండల ఉద్యాన అధికారి జక్కుల అర్చన తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ధర ప్రకారం మామిడి తోట రూ 50 వేలకు పాట ప్రారంభించగా రూ 53 వేలకు మామిడి వ్యాపారి బాబా దక్కించుకున్నారు. సరుగుడు తోటలను రూ 85 వేలకు పాట ప్రారంభించగా రూ 2 లక్షల 3 వేలకు శ్రీనివాస్ దక్కించుకున్నట్లు ఉద్యాన అధికారి అర్చన తెలిపారు. వేలం పాటలో జిల్లా ఉద్యాన అధికారి అనిత, బెల్లంపల్లి వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, అటవీ అధికారి రాథోడ్ శంకర్, ఉద్యాన అధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.