calender_icon.png 9 January, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పఠనా నైపుణ్యాలపై శ్రద్ధ తీసుకోవాలి

03-01-2025 01:21:33 AM

  1. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
  2. అమీర్‌పేట్‌లో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): విద్యార్థుల పఠనా నైపు ణ్యాలు, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం అమీర్‌పేట్ డీకే రోడ్‌లో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు చదవడం, బేసిక్స్‌పై ఎక్కువ శ్రద్ధ కల్పించాలని అన్నారు. డీఈవో  రోహిణి, తహసీల్దార్ పద్మసుందరి, డిప్యూటీ ఈవో యాదయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో చ్తెను కాల్చొద్దు..

బహిరంగ ప్రదేశాల్లో చెత్త, వ్యర్థాలను కాల్చొద్దని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలను కోరారు. తన ఛాంబర్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సురేశ్, అసిస్టెంట్ ఇంజనీర్ సాయిదివ్య, మీడియా కోఆర్డినేటర్ సోమేశ్‌కుమార్, నాగమణి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 

టీజీఏ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్(టీజీఏ) 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. కార్య క్రమంలో ఆ యూనియన్ హైదరాబాద్ జి ల్లా అధ్యక్షుడు కేబీ కృష్ణయాదవ్, ఉపాధ్యక్షులు డాక్టర్ సురేందర్, రాజేందర్, ఆర్ కోటాజీ, శ్రీరామ్, నర్సింగరావు, సునీతజోషి, మంజుల రెడ్డి, బీ కుమార్, శ్రవణ్ కుమార్‌రెడ్డి, ఎండీ గౌస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.